శాంతిభద్రతల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంత కఠినంగా ఉంటారో మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేయాలన్నా, వేధించాలన్నా భయపడేలా చట్టం పనిచేస్తుంది..ఆడపిల్లల జోలికొస్తే అదే ఆఖరి రోజు అవుతుంది. ప్రాణాల మీద ఆశ ఉంటే పాడు పని చేయొద్దంటూ గతంలో చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఇవాళ రాప్తాడు ఘటనతో మరోసారి నిజమయ్యాయి. 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన, నేరస్తులకు సింహస్వప్నంగా మారారు.
రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై రంపంతో ఘోర దా*డికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌ను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే పట్టుకోవడమే కాకుండా, పోలీసులపై ఎదురుదా*డికి దిగిన నిందితుడి కాళ్లల్లోకి ఆరు బుల్లెట్లు దూర్చి ఎన్కౌంటర్ చేయడం చంద్రబాబు మార్క్ పరిపాలనకు అద్దం పడుతోంది. నేరం చేసినవాడు ఎంతటివాడైనా సరే చట్టం ముందు తప్పించుకోలేడని, మహిళల రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో ఈ ఘటనే స్పష్టం చేస్తోంది.
2024 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణపై సీఎం చంద్రబాబు
స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో పెరిగిపోయిన రౌడీయిజం, మహిళలపై అరాచకాలకు చెక్ పెడుతూ..నేరం జరిగితే క్షణాల్లో స్పందించేలా పోలీసు వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. గతంలో తిరుపతి, ముచ్చర్ల, విజయవాడ లాంటి ప్రాంతాల్లో జరిగిన లైంగిక దా*డుల విచారణను వేగవంతం చేసి నిందితులను జైలుకు పంపించడంతో పాటు ఇవాళ రాప్తాడు ఉన్మాదికి బుల్లెట్ల షాక్ ఇవ్వడం వరకు చంద్రబాబు సర్కార్ కఠిన వైఖరినే అవలంబించింది.
మహిళలు, విద్యార్థినులు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే బలమైన సందేశం రాప్తాడు ఎన్‌కౌంటర్‌తో సమాజంలోకి వెళ్లింది. ఆడపిల్లల జోలికొస్తే ఎదురయ్యే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో నిరూపితం కావడంతో ప్రజల నుంచి ప్రభుత్వంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో చట్టం తన పని తాను వేగంగా పూర్తిచేస్తుందని, మహిళల రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.











