అందం, అభినయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ టాలెంట్ ప్రదర్శించే కథానాయికల్లో రాశిఖన్నా.. ఒకరు. అగ్రహీరోలతో పాటు, మీడియం రేంజ్ హీరోల సరసన కూడా నటించి మెప్పిస్తోన్న అమ్మడికి.. ప్రస్తుతం సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలకేమాత్రం కొదవలేదు. అటు బాలీవుడ్ లో కూడా రాశీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ ఆమె డెబ్యూ మూవీ ‘మద్రాస్ కేఫ్’ విజయం సాధించి రాశీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఎర్లియర్ గా రాశీ ఖన్నా ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుసగా సక్సెస్ అందుకొంది.. ప్రస్తుతం ఆమె ‘అరణ్మణై 3’ తమిళ సినిమాలో హారర్ కేరక్టర్ కోసం రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోస్ ను ఇన్ స్టా, ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ .. తన ఫాలోవర్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది.
అందులో భాగంగానే అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో రీసెంట్ గా కొన్ని పిక్స్ పెట్టింది. అందులో రాశీ హాఫ్ శారీ లో రీవీలై.. షాకిచ్చింది. ఓణీ కట్టిన దీపావళీ.. వచ్చెను మా ఇంటికీ అంటూ కుర్రకారు పాటలు పాడేసే రేంజ్ లో అందంగా మెరిసిసిపోతోంది. గ్రీన్ పరికిణీ , రెడ్ ఓణీలో రాశీ ఖన్నా నిజంగా అందాల రాశి అనిపించుకుంది. ఈ ఫోటో షూట్ ను శ్రావణ్ కుమార్ అనే ఫోటో గ్రాఫర్ చేశాడట. తనలోని మరో కోణం చూపించిన శ్రావణ్ కు ధన్యవాదాలు అంటూ రాశీఖన్నీ అతడి పనితనాన్ని తెగ మెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాశీ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.