సినిమా రంగంలో మగవాళ్ల కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగినా అమ్మాయిల కెరీర్ మాత్రం కొంతకాలమే. ఆలోగానే వారు చకచకా సినిమాలు చేసేస్తుంటారు. అలా అవకాశాలు కూడా రావాలి. రష్మిక విషయంలో అదే జరిగింది. 2017లో ‘ఛలో’ సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది ఈ భామ. దానికి ఏడాది ముందు కిర్రాక్ పార్టీతో కన్నడ రంగంలో పరిచయమైంది. కానీ తెలుగులో ఛలో హిట్ అవడం, ఆ తర్వాత గీతగోవిందం కూడా హిట్టవడంతో గోల్డెన్ భామగా రష్మిక పేరుతెచ్చుకుంది. ఇప్పుడు బిజీగా ఆర్టిస్టు ఎవరంటే రష్మిక పేరు కూడా అందులో వినిపిస్తుంది.
ఇలా ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. తాజాగా ఆమె ఓ రైతు పాత్రలో కనిపించబోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తను పొలం దున్నుతున్నట్లు ఉన్న ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంతకుముందు హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఫిదాలో పోషించిన పాత్ర తరహాలోనే ఇది కూడా ఉంటుందా అన్న అనుమానం ఉంది. కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఈ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ప్రస్తుతం రష్మిక మూడు భాషల చిత్రాల్లో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకు మొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ పుష్పను చెప్పాలి. దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హిందీలో కూడా రెండు సినిమాలను ఆమె అంగీకరించింది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘మిషన్ మజ్ను’ రూపొందుతోంది. అలాగే అమితాబ్ బచ్చన్ తో ఓ సినిమాను కూడా అంగీకరించింది. అందులో అమితాబ్ కూతురిగా రష్మిక నటిస్తోందట. తమిళంలో కార్తి ‘సుల్తాన్’ గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఏప్రిల్ 2న సుల్తాన్ విడుదలవుతుంది. సక్సెస్ రేటు బాగా ఉండటం రష్మికకు కలిసొచ్చిన అదృష్టం. ఇప్పుడు పొలం దున్నుతున్నట్టుగానే సినిమా రంగాన్ని కూడా దున్నేస్తుందని అనుకోవచ్చు.
Link : https://www.instagram.com/p/CMhdl3fJWb9/
Must Read ;- విజయ్ – రష్మిక మరోసారి కలిసి నటించనున్నారా?