‘ఛలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది రష్మిక మందణ్ణ. ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ చిత్రం తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా రష్మిక తమిళ్ లో కూడా సూర్య తమ్ముడు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఇక అసలు మేటర్లోకి వెళితే .. రష్మిక చంఢీగర్ లో తన షూటింగ్ ను ముగించుకుని తిరిగి వస్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసింది. గ్రే కలర్ టీ షర్టు దానికి మేచింగ్ గా నలుపు రంగు ప్యాంటు ధరించి చాలా అందంగా ఉంది ఆమె. అంతేకాకుండా ఆ టీ షర్టుకు తగ్గ నలుపు, తెలుపు, బ్రౌన్, గ్రే రంగులతో కూడిన ఒక స్కార్ఫ్ కూడా ధరించింది.
ఇక డ్రెస్ కు సరిపడా కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని ఎయిర్ పోర్టులో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది రష్మిక. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆమె ఒక మ్యూజిక్ వీడియోలో నటిస్తోందని టాక్. ఈ వీడియోను ప్రముఖ ర్యాప్ సింగర్ బాద్‍షా డిజైన్ చేశారని అందులో ఆయనతో పాటు రష్మిక కూడా ఆడి పడతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ చంఢీగర్ లో జరుగుతోందని ఆ పని ముగించుకుని రష్మిక హైదరాబాద్ చేరిందని అంటున్నారు.
Must Read ;- పందిమాంసం అంటే మిక్కిలి మక్కువ అంటోన్న కన్నడ బ్యూటీ
ఆమె ఈ విధమైన మ్యూజిక్ వీడియో చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇక రష్మిక ‘పుష్ప’ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతోంది. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు రష్మిక మరో రెండు సినిమాలను తెలుగులో నటిస్తోంది.