మాస్ మహారాజా రవితేజ హీరోగా .. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఖిలాడి’. ఏ స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ పెన్మెత్స సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికలు గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. మే 28న సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఖిలాడి’ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా ఈ రోజు ‘ఖిలాడి’ టీజర్ విడుదల చేశారు.
Khiladi Teaser Out :
‘క్రాక్’ తర్వాత రవితేజ నటిస్తోన్న మరో సినిమా ‘ఖిలాడి’ సైతం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే టీజర్ ను కట్ చేశారు మేకర్స్. రవితేజ ఇందులో రెండు వేరియస్ కేరక్టర్స్ ప్లే చేస్తున్నట్టు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అందులో ఒకటి ఖైదీ పాత్ర అయితే.. మరొకటి మర్డరర్ కేరక్టర్. ఒక పాత్ర జైల్లో ఉండగానే.. మరో పాత్ర మర్డర్స్ చేస్తుందని తెలుస్తోంది. ఇంకా ఈ టీజర్ లో యాక్షన్ కింగ్ అర్జున్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ముఖేశ్ రుషి, అనసూయ తదితరులు కనిపిస్తున్నారు. మరి ఖిలాడి గా మాస్ రాజా ఏ రేంజ హిట్ అందుకుంటాడో చూడాలి.
Must Read ;- ఇటలీలో ఛిల్ అవుతోన్న ‘ఖిలాడి’