ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ కొట్టిన మారుతి తదుపరి చిత్రాన్ని ఇప్పటి వరకు ఎనౌన్స్ చేయలేదు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయాలనుకున్నారు. కథ చెప్పడం జరిగింది కానీ.. కన్ ఫర్మ్ కాలేదు. సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా మారుతి నెక్ట్స్ మూవీ చేయడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. రామ్ తో సెట్ కాకపోవడంతో రవితేజకి మారుతి కథ చెప్పడం.. కథ నచ్చి ఓకే అనడం జరిగింది. ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. ఈ సినిమా ఆగింది అని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. రెమ్యూనరేషన్ విషయంలో తేడాలొచ్చాయి అని టాక్ వినిపిస్తోంది. రవితేజ 12 కోట్లు డిమాండ్ చేశారట. యు.వి.క్రియేషన్స్ 9 కోట్లు ఇస్తామంటే.. రవితేజ మాత్రం 12కోట్లకు తగ్గనన్నారట. అయితే… రవితేజను 10 కోట్లకు ఒప్పించేందుకు మారుతి ప్రయత్నిస్తున్నారట కానీ.. రవితేజ మాత్రం 12కి తగ్గనంటున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. మారుతి దగ్గర మరో ఆప్షన్ ఉందట. అది ఏంటంటే.. గోపీచంద్ తో మారుతి సినిమా చేయాలనుకుంటున్నారు.
గోపీచంద్ కూడా మారుతి సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక యు.వి క్రియేషన్స్ కూడా ఎప్పటి నుంచో గోపీచంద్ తో సినిమా చేయాలనుకుంటోంది. ఇప్పుడు గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటుందని తెలిసింది. అందుచేత రవితేజతో ప్రాజెక్ట్ సెట్ కాకపోతే గోపీచంద్ తో చేయచ్చు అనుకుంటున్నారట. మరి.. మారుతి ప్రాజెక్ట్ ఎవరితో సెట్ అవుతుందో చూడాలి.
Must Read ;- రవితేజ ద్విపాత్రాభినయంతో ఖిలాడి!