మాస్ మహా రాజా క్రాక్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుక వచ్చాడు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. పండగ అయిపోయినా క్రాక్ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్షసుడు సినిమాతో సక్సస్ సాధించిన రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు.

ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో లిక్ లాక్ సీన్ ఉందట. డైరెక్టర్ రమేష్ వర్మ ఈ లిప్ లాక్ సీన్ గురించి చెప్పినప్పుడు రవితేజ నో చెప్పారట. అయితే.. రమేష్ వర్మ ఈ సీన్ ఎంత ఇంపార్టెంటో చెప్పడంతో రవితేజ్ ఆఖరికి.. ఇష్టం లేకపోయినా దర్శకుడి కోరిక మేరకు ఓకే చెప్పారట. ఇటీవల ఈ సీన్ ను చిత్రీకరించారని సమాచారం. ఇప్పుడు లిప్ లాక్ సీన్ అనేది సినిమాల్లో కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే.. లిప్ లాక్ లేని సినిమా రావడం అనేది గగనం అయిపోయింది.
అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత ఈ లిప్ లాక్ ట్రెండ్ మరింత పెరిగిందని చెప్పచ్చు. ట్రెండ్ కి తగ్గట్టుగా స్టార్ హీరోలు సైతం లిప్ లాక్ కి ఇష్టం ఉన్నా లేకున్నా ఎస్ చెప్పాల్సివస్తుంది. ఆఖరికి రవితేజ కూడా లిప్ లాక్ సీన్ లో నటించేశాడు. క్రాక్ తో మళ్లీ ఫామ్ లోకి రావడంతో ఖిలాడి సినిమాతో మరో సక్సస్ సాధించాలి అనుకుంటున్నాడు మాస్ రాజా. సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. క్రాక్ తో సక్సస్ సాధించిన రవితేజ ఖిలాడితో కూడా విజయం సాధిస్తారేమో చూడాలి.
Must Read ;- క్రాక్’ సినిమా వెంకీ చేయాల్సిందట!











