మాస్ మహారాజా రవితేజ – గబ్బర్ సింగ్ బ్యూటీ శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం క్రాక్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ పోలీస్ స్టోరీని ఈ సంవత్సరం సమ్మర్ స్పెషల్ గా మే నెలలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమాని 2021 సంక్రాంతి కానుకగా.. జనవరి 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తుంటే… శృతిహాసన్ ఆయన భార్యగా నటిస్తుంది. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ – మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడవ సినిమా ఇది.
గతంలో రవితేజ – మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో బలుపు, డాన్ శీను సినిమాలు రూపొందాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సస్ సాధించాయి. దీంతో తాజా చిత్రం క్రాక్ పై పాజిటివ్ టాక్ ఉంది. ఇక సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న క్రాక్ మూవీకి సంబంధించి ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. రవితేజ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. రవితేజ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ ట్రైలర్ ను న్యూయర్ కానుకగా జనవరి 1న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయనుందో చూడాలి.
Must Read ;- రవితేజ మారుతి సినిమా ఆగిందా? అసలేం జరిగింది?
Dubbing in process #KRACK pic.twitter.com/qDfMHseqgS
— Ravi Teja (@RaviTeja_offl) December 29, 2020