పొంగూరు నారాయణ మరోసారి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు.
నారాయణ 2019లో గెలుపొందకపోవడం అటుంచుతే, 2024లో నారాయణ గెలుస్తారని అన్ని సర్వేలు వెల్లడించాయి.. జగన్ ప్రభుత్వం 2019 తర్వాత నారాయణను తొక్కేయడానికి, లెవెల్ బెస్ట్ ప్రయత్నించింది. నారాయణ సంస్థలను ఇబ్బంది పెట్టడంతో పాటు, అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో కూడా నారాయణను ఇరికించే ప్రయత్నం చేయడం మనం ఇదివరకే చూసాం.
ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత, మాజీ మంత్రిపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేయడానికి నారాయణ సోదరుడి భార్యను రంగంలోకి దించారు. నారాయణ పాత్రను జనాల్లో నవ్వులపాలు చేసి నెల్లూరు సిటీ సీటును కాపాడుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది వైసీపీ నాయకుల్లో. కుటుంబంలో చీలికలు సృష్టించడం, కుటుంబ సభ్యులను హాస్యాస్పదమైన ఆరోపణలు చేయడం వైసీపీకి కోతేమ్ కాదు, ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలాంటి వ్యూహం చేసి విజయం సాధించిందనే చెప్పాలి..
ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇంతకు ముందు చంద్రబాబు – లక్ష్మీపార్వతి, చంద్రబాబు – నార్నె శ్రీనివాసరావు, మేకపాటి కుటుంబం, కోటంరెడ్డి కుటుంబాల వరకు ఇటీవల ఎన్నో ఉదాహరణలు కళ్లారా చూశాం. నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీ ఓడిపోవడం చూశాం. వైఎస్సార్ కాంగ్రెస్ కు కంచుకోటగా నిలవాల్సిన జిల్లా మెల్లగా జారిపోతోంది. నారాయణపై దాడి చేయడం జిల్లాను కాపాడే తొలి ప్రయత్నంగా కనిపిస్తోంది.
అయితే నారాయణ సొంత తమ్ముడు అయినటువంటి పొంగూరు సుబ్రహ్మణ్యం అసలు నిజం బయటపెట్టాడు. తన భార్య రమ్యకి మానసిక స్థితి బాగోలేదని, మానసిక ఒత్తిడితిని తను ఇలా మాట్లాడుతోందని తెలియజేసాడు. దయచేసి రమ్య వీడియోలో మాట్లాడింది పట్టించుకోవాడు అని ఒక నోట్ రిలీజ్ చేసాడు. అలాగే దీని పై రాజకీయం చెయొద్దు అనికూడా వేడుకుంటున్నాడు. ఇదంతా మెంటల్ డిప్రెషన్ వల్లనే తప్ప వేరే ఏమి లేదని తెలిపాడు..