టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసి.. సీనియర్ హీరోల్లో 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన తొలి హీరోగా నాగార్జునకి ఓ రికార్డ్ అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఈ మూవీలోని బంగార్రాజు క్యారెక్టర్ పేరే టైటిల్ గా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అంతే.. వెంటనే నాగార్జున బంగార్రాజు టైటిల్ ని రిజిష్టర్ చేయించడం జరిగింది. సోగ్గాడే చిన్ని నాయనా సక్సస్ సంబరాల్లో బంగార్రాజు టైటిల్ తో సినిమా చేస్తానని ప్రకటించారు.
అయితే… అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగార్రాజు వార్తల్లో ఉంటూనే ఉంది కానీ… ఇప్పటి వరకు బంగార్రాజు గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో అసలు బంగార్రాజు మూవీ ఉందా..? లేదా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లు వార్తల్లో వున్న బంగార్రాజు ఆతర్వాత సైలెంట్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు బంగార్రాజు డిసెంబర్ లో సెట్స్ పైకి రానున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అబిమానులు హమ్మయ్యా బంగార్రాజు సెట్స్ పైకి వెళుతుంది అని కొంత మంది సంతోషంగా ఫీలవుతుంటే… ఈసారైనా నిజంగానే సెట్స్ పైకి వెళుతుందా..? లేక ఎప్పటిలానే వార్తలకే పరిమితం అవుతుందా..? మరి కొంత మంది అని ఆలోచనలో పడ్డారు.
అసలు.. బంగార్రాజు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే… నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ బంగార్రాజు, మన్మధుడు సీక్వెల్ మన్మథుడు 2 తీయాలని ఫిక్స్ అయ్యారు. ఈ రెండింటిలో ఏది ముందు స్టార్ట్ చేద్దామాని ఆలోచించి ఆఖరికి మన్మధుడు 2 స్టార్ట్ చేసారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే. దీంతో మన్మథుడు 2 ఇచ్చిన షాక్ లో నాగార్జున ఒకానొక టైమ్ లో బంగార్రాజు చేయకుండా ఉంటేనే బెటరేమో అనుకున్నారట. అందుకనే ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఇప్పటి వరకు అలానే ఉంచారు. అందుకే ఇంత ఆలస్యం అయ్యింది. అయితే… కళ్యాణ్ కృష్ణ గత కొంత కాలంగా బంగార్రాజు కథ పై కసరత్తు చేస్తునే ఉన్నారు. రీసెంట్ గా బంగార్రాజు కథని నాగ్ కి వినిపించడం… కథ విని నాగ్ ఓకే అనడం జరిగిందట.
దీంతో బంగార్రాజును స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనం చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని తెలిసింది. సోగ్గాడే చిన్ని నాయానా నాగ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. మరి… బంగార్రాజు కూడా అంతటి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Also Read: అభిమానికి నాగార్జున జూమ్ కాల్











