ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరులో అభాసు పాలైంది. పట్టాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన భారీ డయాస్‌పై వైసీపీ నేతలు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. స్టేజీ వెనుక సీఎం జగన్మోహన్‌రెడ్డి, కనిగిరి ఎంఎల్ఏ బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ఫ్లెక్సీలు దర్శినమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమంలో జిల్ జిల్ జిగేలు రాణి, బావగారు వచ్చేటి వేళ.. బంతిపూలు తెచ్చేటి వేళ అంటూ రికార్డింగ్ డాన్సులు వేయడంపై జనం మండిపడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఈ ఆరబోత కార్యక్రమం వీడియో వైరల్‌గా మారింది.
మేం మారం..
వైసీపీ నాయకుల కార్యక్రమాల్లో రికార్డింగ్ డాన్సులు ఆనవాయితీగా మారాయి. జనాన్ని పోగు చేసేందుకు, వచ్చిన జనం ఎక్కడికీ వెళ్ల కుండా ఉండేందుకే రికార్డింగ్ డాన్సులతో ప్రజలను ఆకర్షిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంక్షేమంతో ఆకర్షించాల్సిన ప్రభుత్వం, రికార్డింగ్ డాన్సులతో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వారం కిందట సాక్షాత్తూ మంత్రి కన్నబాబు పాల్గొన్న కార్యక్రమంలోనూ ఇలాగే రికార్డింగ్ డాన్సులు నిర్వహించి, వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ రికార్డింగ్ డాన్సుల సంసృతి విస్తరించింది. అక్కడే పోలీసులు ఉన్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Must Read ;-తెల్లకార్డుతో పనిలేదు : మైలవరంలో అమ్మకానికి ఇళ్ల పట్టాలు