మాస్క్ వేసుకోండి.. మాస్క్ వేసుకోండి.. అంటే కొత్తగా ఇప్పుడే వింటున్నట్లు అందరూ వింతగా చూస్తున్నారు గానీ.. ఈ మాస్క్ వ్యవహారం ఈనాటిది కాదు. వందేళ్ల క్రితమే వాడుకలోకి వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఆధారాలతో చూపిస్తూ.. మాస్క్ అవసరతను గుర్తుచేసింది రెడ్ క్రాస్ సంస్థ.
ఇప్పుడు కరోనా వ్యాధిలాగే వందేళ్ల క్రితం.. అనగా 1918లో స్పానిష్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచాన్ని కబళించింది. సుమారు అయిదు కోట్ల మందిని బలితీసుకుంది. ఆ సమయంలో ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటి లాగే మాస్కుల వాడకాన్ని సూచించాయి అప్పటి ప్రభుత్వాలు. ‘మాస్కులు వాడండి, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోండి’ అని ప్రకటనలు, ప్రచారం చేశాయి.
ఈ నేపథ్యంలో పాత కొత్త కలయికతో ఆసక్తికర ప్రచారం చేసింది రెడ్ క్రాస్ సంస్థ. అప్పట్లో ప్రచార పత్రం ఒకదాన్ని పేర్కొంటూ.. ‘(మాస్క్ వాడాలని) మేము 1918లో చెప్పాము.. 2020లోనూ చెబుతున్నాము..’ అంటూ సంస్థ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ పోస్టుకు 5,200 లైకులు, 2,500 రీ ట్వీట్లు రావడం గమనార్హం.
మైనింగ్‌లో పెద్దిరెడ్డి అరాచకం… వేల కోట్లు హాంఫట్…!!
వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే....