యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. జనవరి 7న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడు అనేది ఓ సస్పెన్స్ మూవీలా తయారైంది. దసరా కానుకగా అక్టోబర్ 13న వస్తోందని ఊరించారు. చివరికి తుస్ మనిపించారు. అయితే.. దసరాకి రావడం లేదు మరి.. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏంటంటే.. సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది.
దీంతో జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రాకపోయినప్పటికీ.. 2022 సంక్రాంతి న రావడానికి ఆర్ఆర్ఆర్ శాయశక్తుల ప్రయత్నిస్తోందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోది. 2022 సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయి అనే విషయం పై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేసింది చిత్రసీమ. భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సర్కారు వారి పాట. వీటిలో సర్కారు వారి పాట తప్పుకుంటుందని టాక్. మిగిలిన భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అంటున్నాయి.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వచ్చేందుకు ఆర్ఆర్ఆర్ మూడు డేట్ లు అనుకుంటున్నాయని తెలిసింది. ఇంతకీ ఆ డేట్ ఏంటంటే.. జనవరి 7, 8, 9 తేదీల్లో ఏదో ఓ తేదీ ఫిక్స్ చేసి, త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని రాజమౌళి భావిస్తున్నాడని సమాచారం. ఇది పాన్ ఇండియా మూవీ. తెలుగులో రిలీజ్ డేట్ ఒక్కటే కుదిరితే సరిపోదు. దేశ వ్యాప్తంగా మిగిలిన సినిమాల రాక చూసుకోవాలి. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించడం ఆలస్యం అవుతోందని సమాచారం. సంక్రాంతికి సెట్ కాకపోతే సమ్మర్ కి వెళుతుంది అంటున్నారు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ విడుదల పై క్లారిటీ రానుందని తెలిసింది.
Must Read ;- చరణ్ శంకర్ మూవీలో హైలైట్ ఇదే











