కరోనా చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్ లభ్యతను తెలియజేసేలా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తన వెబ్‌సైట్ (readytofightcovid.in)లో సమాచారాన్ని పొందుపరుస్తోంది. ఈ ఔషధాలు లభించే ఆసుపత్రులు, మెడికల్ షాపుల జాబితా,వాటి ఫోన్ నంబర్లు, చిరునామాలతో వివరాలు ఆ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.800-266-708 నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. మరో ఫార్మా సంస్థ సిప్లా హెల్ప్‌లైన్ నంబర్ 8657311088. info.availability@cipla.comకు ఈ-మెయిల్ చేసి వివరాలు పొందవచ్చు.
Must Read ;- రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం











