అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పేరులో అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరును చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో ఈ పథకం కొనసాగుతుండగా జగన్ సర్కార్ గడిచిన మూడేళ్లుగా ఈ పథకాన్ని పూర్తిగా నిలక్ష్యం చేసింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో తిరిగి ఈ పథకాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వానికి ఏర్పడింది. కాగా,ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట ఈ పాఠ్యం అమలవుతుండగా తాజాగా దానిని అంబేద్కర్ పేరును తొలిగించి జగనన్న విదేశీ విద్యా దీవెన గా మార్చింది ప్రభుత్వం.
పథకానికి అంబేద్కర్ పేరును తొలగించడం పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ పేరు పెట్టుకోవడం కోసం మహాశయుని పేరును తొలగిస్తారా అని ధ్వజమెత్తారు. ఇది జగన్ అహంకారానికి నిదర్శమని ఆయన దుయ్యబట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకునేందుకు 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చంద్రబాబు తెలిపారు.
ఈ పథకానికి జగన్ తన పేరును చేర్చుకోవడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరుని తొలగించడం ఆయనను అవమానించినట్టేనని చంద్రబాబు అన్నారు. ఇది జగన్ అహంకారమని విమర్శించారు. అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించడమేనని చెప్పారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.