కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఒక్క చాన్స్ తో చిత్ర పరిశ్రమలో మాంచి పేరు సంపాదించుకుంది. కేజీఎఫ్ 2 చిత్రం విజయం సాధించడం తో తన రెమ్యూరేషన్ ను ఒక్కసారిగా పెంచేసిందని చిత్ర వర్గాలు చెప్పుతున్నాయి.అనతి కాలం లో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు లుక్స్ తోనే ప్రేక్షకులను కట్టేస్తుంది. అందం అభినయం తోపాటు మంచి హైడ్ ఈ భామకు ప్లస్ అయ్యిందని చెప్పుతున్నారు.
కేజీఎఫ్ 2 తో హిట్ కొట్టిన శ్రీనిధి శెట్టి కి అవకాశాలు భారీగా వస్తున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళు,కన్నడ చిత్రాల్లో నటించేందుకు ఆవకాశాలు రావడం తో రెమ్యూనేషన్ పెంచేసిందని చిత్ర వర్గాలు అంటున్నారు..
శ్రీనిధి తదుపరి సినిమాగా తమిళంలో రూపొందిన ‘కోబ్రా’ .. ఆ ఆగస్టు 11వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.కేజీఎఫ్ 3′ సెట్స్ పైకి వెళ్లినా ఇక అమ్మడిని పట్టుకోవడం కష్టమనే అంటున్నారు.
కాలేజ్ రోజుల్లోనే అందగత్తెగా శ్రీనిధి శెట్టి అనేక బహుమతులు గెలుచుకుంది. ఆ తరువాత మోడల్ గా బిజీ అయింది. మోడల్ గా ఆమె పోస్టర్స్ బయటికి రావడంతో ‘కేజీఎఫ్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో ఆమెకి ఒక రేంజ్ లో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే..