గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారంతో హోరెత్తించాయి. ప్రచారం ముగియడంతో ఇక అధికారులు పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను ఇప్పటికే ఎన్నికల అధికారులు నిర్వహించారు. అయితే ఓటు వేసేవారికి ఓటు గుర్తింపు కార్డులేకున్నా సంబంధిత గుర్తింపు కార్డులు గానీ డాక్యుమెంట్లగానీ చూపించి ఓటు వేసుకోవచ్చంటున్నారు. ఓటర్లకు ఈ అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.
ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారణకు ఓటరు గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. అయితే ఈ గుర్తింపు కార్డులేనివారు ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవి ఉంటే చాలు…
1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్, 3. డ్రైవింగ్ లైసెన్స్, 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫై కార్డ్, 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్, 6. పాన్ కార్డు, 7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు, 8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, 11. ఎం.ఎల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, 12. రేషన్ కార్డు, 13. కుల ధృవీకరణ పత్రం, 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. అంగవైకల్యం సర్టిఫికేట్, 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, 18. పట్టదారు పాస్ బుక్.
వీటిలో ఏదైనా ఒకటి చూపించి ఓటును వేయొచ్చు.