బిగ్ బాస్ లోకి వెళ్లాలా.. అయితే ఓసారి రాంగోపాల్ వర్మను కలిస్తే బాగుంటుందేమో! ఇలా ఆలోచించే వారే ఈ మధ్య ఎక్కువయ్యారు. ఇంటర్వ్యూకి వెళితే యాంకర్లు కూడా ఆర్జీవీతో ఏదో ఒక కామెంట్ చేయించుకోవాలన్న తహతహలాడుతున్నారు. ఏకంగా ఆయనతోనే ఇంటర్వ్యూ చేయించుకోవాలనుకున్నవారూ ఉన్నారు. దీనికంతటికీ కారణం అరియానా గ్లోరీ. ఆర్జీవీ దృష్టిలో ఆమె గ్గోరియానా. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అన్నట్టు అషురెడ్డి లైన్ లో కనిపిస్తోంది. డబ్ స్మాష్ ల పుణ్యమా అని అషురెడ్డికి అంతో ఇంతో పేరు వచ్చింది.
బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అషురెడ్డికి ఉన్న ఫాలోయర్లు తక్కువేమీ కాదు. ఇప్పుడా జాబితాలో ఆర్జీవీ కూడా చేరతారేమో. అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆర్జీవీ దగ్గరకు ఈ భామ వెళ్లింది. ఆయన దగ్గరకు వెళ్లాలంటే చిట్టిపొట్టి డ్రెస్ లు వెళ్లాలి. హాట్ గా కనిపిస్తే ఆర్జీవీ ఎందుకు ఊరుకుంటారు.
అషురెడ్డి కూడా అలాగే వెళ్లింది.. వర్మ ఊరుకుంటారా.. సెల్ ఫోన్ ఆమె అన్ని యాంగిల్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల అరియానాను ఆర్జీవీ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
అషురెడ్డి కూడా అలాంటి ఇంటర్వ్యూ కోసమే వెళ్లిందంటున్నారు. హాట్ దుస్తుల్లో ఆమె ఎక్స్ పోజింగ్.. దానికి వర్మ రియాక్షన్ చూసి కొందరికి గమ్మత్తుగా ఉంటే, ఇంకొందరికి మండుతోంది. ఇలా వీడియో తీసిన వర్మ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఎలా ఉంటారు. చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు గుప్పిస్తున్నారు. ఆమె కుర్చీలో కూర్చుంటే వర్మ కింద నుంచి సెల్ ఫోన్ తో ఏం తీస్తున్నాడో కూడా తెలియడం లేదు.
తెలియకపోవడానికి ఏమీ లేదు.. మనకి కనిపించనది ఆయనకు కనిపిస్తుంది అంతే. ఎవరు ఏమంటే మనకేంటి మనకు పబ్లిసిటీ వచ్చిందా లేదా అన్నదే ఈరోజుల్లో ముఖ్యం. ఫ్రీ పబ్లిసీటీ మెండుగా రావాలంటే వర్మను ఓసారి కలిసి చూస్తే చాలు. అషు రెడ్డికి కూడా సినిమా ఛాన్సులు వచ్చిపడతాయేమో. అదే జరిగితే ఈ డబ్ స్మాష్ భామకు డబ్బుకు డబ్బే.. మరి అషురెడ్డి తర్వాత ఆర్జీవీ దగ్గరకు ఇంకెవరు వెళతారో చూడాలి.
Must Read ;- వర్మ చిన్నప్పుడే తొక్కడం మొదలెట్టారట!











