బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్‌కు ఊహించని సర్ ప్రైజ్ దక్కింది. ఈ సంక్రాంతికి అతని జీవితంలో మరచిపోలేని మంచి గిఫ్ట్ వరించింది. అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? అభిజిత్‌ను వరించిన ఆ అదృష్టం ఏంటని ఆలోచిస్తున్నారు? మరెందుకు ఆలస్యం సవివరంగా చదివేయండి…
హిట్ మ్యాన్ ఫోన్.. మిస్టర్ కూల్ పరేషాన్!
బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజేతగా నిలిచిన తర్వాత అభిజిత్‌కు అభిమానం అమాంతం పెరిగిపోయింది. ఊహించని వ్యక్తుల నుంచి ఫోన్లు… అనుకోని ఆఫర్లు అలా వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే.. మన మిస్టర్ కూల్ అభిజిత్ కు టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడారట. ఈ విషయాన్ని అభిజితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అభిజిత్… కంగ్రాట్స్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ, హనుమ విహారికి మధ్య అనుకోకుండా బిగ్‌బాస్ షో గురించి చర్చ జరిగిందట. మాటల్లో మాటగా.. బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్‌కు చెప్పాడట మన విహారి. అంతేకాకుండా అతను తనకు పెద్ద ఫ్యాన్ అని వివరించాడట. వెంటనే.. రోహిత్ అభిజిత్‌కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపారట.
మరపురాని, మరచిపోలేని గిఫ్ట్…!
రోహిత్ వంటి హిట్ మ్యాన్ ఫోన్ చేయడమే జీవితంలో ఓ మరచిపోలేని అనుభూతి. అటువంటిది రోహిత్.. అభిజిత్‌కు మరపురాని బహుమతి ఒకటి పంపారట. ప్రత్యేకంగా అభినందిస్తూ… తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చారట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్… రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చారని అభిజిత్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఆ అనుభూతి ఎప్పటికీ చెరిగిపోనిదని సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చారు.
Must Read ;- మెగాస్టార్ మూవీలో.. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్