జగన్ రెడ్డి పాలన.. పచ్చి బూతులకు కేఆరాఫ్ అన్నది ఈ నాలుగునరేళ్ళ పాలనలో చూస్తున్నదే. ఒకప్పుడు రాజకీయాలు విమర్శలు.., ఆరోపణలు.., ఎద్దేవాలకే పరిమితం అయ్యేవి. కానీ పొలిటికల్ ట్రెండ్ నేడు వింత పుంతలు తొక్కుతోంది. వ్యక్తిగత విమర్శలు.., నోటికి ఎంత పెద్ద మాట వస్తే అనేయ్యడం.., బజారు మనుషుల వలె బూతులు మాట్లాడం వంటివి వైసీపీ పాలనలో చూస్తూనే ఉన్నాం. నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రోజా కూడా మరోసారి విపక్షాలపై విరుచుకుపడేందుకు తన నోటికి పని చెప్పింది.
విపక్షాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ.. ఎంత పెద్ద బూతు పదాలు వాడితే జగన్ రెడ్డి వద్ద అన్ని మార్కులు పడుతాయన్నది అందిరికీ తెలిసిందే. అందుకనేమో జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విపక్షాలను నోటికొచ్చినట్లు పరుషపదజాలంతో దూషిస్తుంటారు. అనేక సార్లు విపక్ష నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లు తిట్టడం తరుచు చూస్తూనే ఉన్నాం. కొడాలి.., పేర్ని.., అంబటి..,రోజా.., అనిల్ కుమార్ యాదవ్.., ద్వారంపూడి వంటి వారు తెలుగుదేశం, జనసేన నేతలపై వాడిన బూతులు, వ్యక్తిగత దూషణలు నేటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రోజా.. విపక్షాలపై విమర్శల దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో విపక్షాలను బుడబుక్కల వారితో పొల్చి తిట్టారు. ఇప్పుడు అదే డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకేముంది బుడబుక్కల సంఘాల పెద్దలు రోడ్డెక్కారు. పలు స్టేషన్లో మంత్రి రోజా పై ఫిర్యాదు చేశారు. తక్షణమే రోజా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రోజాకు మైండ్ బ్లాక్ అయ్యి.. ఆత్మరక్షణలో పడింది.
అధికారం చేతిలో ఉందని.., రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని నోటికెంత మాటవస్తే.. అంత మాట్లాడితే.. అదే రాజ్యాంగంలో అనేక శిక్షలు ఉంటాయన్నది వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉంటే ఇంతలా రెచ్చిపోరని సోషల్ మీడియాలో విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు.