మాజీ మంత్రి రోజా… మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా… ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..?? లేనా అన్నట్లు ఉన్నారు.. నగరిలో వరసగా రెండు సార్లు గెలిచిన ఆమె మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు.. అయిదేళ్లలో జగన్ సర్కార్ చేసిన అరాచకాలు, అవినీతి, అసమర్ధ పాలనకుతోపాటు నగరిలో మంత్రిగా, ఎమ్‌ఎల్‌ఏగా రోజా చేసిన విచ్చలవిడి కరప్షన్ సైతం ఆమె ఓటమిని ఎన్నికల ముందుగానే డిసైడ్ చేశాయి.. ప్రస్తుతం రాజకీయాలలో అంత బిజీగా లేని రోజా… తాజాగా మరోసారి లక్‌ని బుల్లితెరపై టెస్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.. ఈసారి ఆమెకి జబర్దస్త్ నుండి మరో షో నుండి ఆఫర్ వచ్చింది..
రోజాపై గతంలో రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఉండేది.. ఆమె నోటి దురుసుతనం, ఆమె బూతులే దీనికి కారణం.. ఆమె ప్రయోగించే పదాలు సైతం సభ్య సమాజం కాస్త చీదరించుకునే స్థాయిలో ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో, రోజా ప్రజలకు దూరం అయింది.. ఆ తర్వాత ఎప్పుడయితే స్మాల్ స్క్రీన్‌పై అడుగుపెట్టిందో ఆమె లక్ మారిపోయింది.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. ఇదే ఆమె ఫేట్ మార్చింది.. ఇదే ఆమె రాజకీయ జీవితాన్ని కూడా మార్చివేసిందని, స్వయంగా ఆవిడే వెల్లడించింది..
గత అయిదేళ్లు అధికారంలో ఉండగా రోజాపై భారీ అవినీతి ఆరోపణలు వినిపించాయి.. సుమారు 2 వేల కోట్ల రూపాయలు ఆర్జించిందని ఆరోపణలు వచ్చాయి.. గతంలో ఒకటీ రెండు కార్లతో కనిపించే ఆమె ఇంటి ఆవరణలో ఈ దఫా ఏకంగా 8 రిచ్ ఫ్యాన్సీ, విదేశీ కార్లు దర్శనమిస్తున్నాయని సొంత పార్టీ నేతలే చెబుతారు.. ఇక, సుమారు 4-5 భారీ నివాసాలు, విల్లాలు, వందల కోట్ల ఆస్తులు దక్కించుకున్నారని వైసీపీ నేతల నుండి వినిపిస్తోన్న మాట..
ఈ ముద్ర పోవాలంటే మరోసారి బుల్లితెరపై దర్శనం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారని చెబుతున్నారు ఎనలిస్టులు.. అయితే, ఆమెను ఇంటింటికి చేర్చిన జబర్దస్త్ షో నుండి ఆఫర్ దక్కలేదట.. జీటీవీ తాజాగా స్టార్ట్ చేసిన ఓ రియాలిటీ షోలో జడ్జ్‌గా రోజా ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.. ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలయింది.. సూపర్ సీరియల్ చాంపియన్ షిప్ షోతో ఆమె బుల్లితెరపై దర్శనం ఇవ్వనున్నారు… అయితే, గతంలో ఆమెపై సానుభూతి ఉండేది.. అది రోజాకి ప్లస్ అయింది.. కానీ, ఈ దఫా ఆమె పప్పులు ఉడకవని, టీటీడీ టికెట్లు అమ్మకం, టూరిజం శాఖ మంత్రిగా అవినీతితో భారీ వ్యతిరేకత మూటగట్టుకున్న రోజా రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడిందని, ఆమెపై నెగిటివిటీ తగ్గే చాన్స్ లేదని చెబుతున్నారు ఎనలిస్టులు.. మరి, బుల్లితెరపై తళుక్కున మెరిసిన ఆమె, ఇక ఇక్కడే సెటిల్ అవ్వాలని, సీరియల్స్‌కి షిఫ్ట్ అవడమే బెటరని సూచనలు, సలహాలు ఇస్తున్నారు.. ఇప్పటికే నగరిలో ఆమెకి పోటీగా మరో నేతని తెరపైకి తీసుకువస్తున్నారు ఆ పార్టీ నేతలు..