చంద్రబాబు..ఈ పేరు వింటే ఐటీ గుర్తొస్తుంటుంది. దేశంలోనే మొట్టమొదటగా ఐటీ ప్రాముఖ్యతను గుర్తించి దానికి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఆయన కృషి వల్లే హైదరాబాద్ ఇవాళ అనేక అంతర్జాతీయ సంస్థలకు వేదికగా మారింది. 2000 సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పుట్టుకొచ్చారు. లక్షలాది మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ ఐటీ విప్లవం వల్ల ప్రయోజనం పొందుతున్నాయంటే..దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది.
ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఓ అరుదైన సంఘటన ఎదురైంది. సింగపూర్‌లోని NRI కమ్యూనిటీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఐతే చంద్రబాబు విజన్ వల్ల తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని ఓ మహిళ ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను ప్రస్తుతం రోల్స్ రాయిస్ కార్ల తయారీ కంపెనీలో AI విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. ఇది చంద్రబాబు దార్శనికత వల్ల సాధ్యమైందన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తే తనను ఈ స్థాయిలో ఉంచిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు రోల్స్ రాయిస్‌ను ఏపీకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు రాజకీయ నేతల జీవితాల్లో అరుదు. ఇది చంద్రబాబుకు ఓ అరుదైన పురస్కారం లాంటిదే. నిజంగా రోల్స్ రాయిస్ ఏపీకి వస్తే..అదో CBN జీవిత చరిత్రలో ఓ మైలురాయి అవుతుంది.
సదరు మహిళ కామెంట్స్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు..తాను ప్రారంభించిన P-4 కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. ఏపీలో ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆ మహిళకు సూచించారు. దీంతో ఆ మహిళ సానుకూలంగా స్పందించారు.











