మహిళలు ఎంత కష్టపడిపనిచేసినా, వారికి గుర్తింపు, విలువ తక్కువనే చెప్పాలి. అటువంటి పురుషాధిక్య ప్రపంచంలో తనని తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నవారు లేకపోలేదు. మగవారిని తలదన్నేలా సంపాదనలో వారికేం తీసిపోం అని నిరూపించుకుంది రోషిణి నాడార్. హెచ్ సీ ఎల్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోషిణీ కోటక్ లీడింగ్ వెల్తీ ఉమెన్ 100 జాబితా లో మొదటి స్థానాన్నిఅందుకుంది.
54,850 కోట్లకు అధిపతి
కోటక్ లెక్కల ప్రకారం రోషిణీ ఆస్తి 54,580 కోట్లు. హెచ్ సీ ఎల్ వ్యవస్థాకులలో ఒకరైన శివ్ నాడార్ కుమార్తెగా కంపెనీ బాధ్యతలు చేపట్టిన రోషిణి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ విలువలను పెంచి ఎన్నో ఉన్నత స్థాయి మార్పులకు కారకురాలయ్యింది. అదే కంపెనీ విలువలను, రోషిణి స్థాయిని కూడా పెంచింది. అమెరికాలోని కెలోగ్ మ్యానేజ్ మెంట్ లో బిజినెస్ లో మాస్టర్స్ చేసిన రోషిణి, హెచ్ సీ ఎల్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇలాంటి ఘనతనందుకోవడం రోషిణికి కొత్తేమీ కాదు. 2017,2018,2019 సంవత్సరాలు గాను వరసగా అత్యంతా ప్రభావవంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించింది. 2020 లో ఏకంగా భారతీయ అత్యంత సంపన్నురాలిగా నిలిచింది. రోషిణి మొదటి స్థానాన్ని అందుకోగా తర్వాతి స్థానాలను కిరణ్ మజుందర్ (36,600 కోట్లు), లీనా గాంధీ తివారి (21,340 కోట్లు) అందుకున్నారు
13 మంది తెలుగు రాష్ట్రాల వారున్నారు
కోటక్ వెల్త్-హురున్ ఇండియా సంపన్న మహిళల జాబితా లో ఏకంగా 13 మంది తెలుగు రాష్ట్రాల నుండి ఎంపకవ్వడం విశేషం. నీలిమా మోటపర్తి (18,620 కోట్లు), మహిమా దాట్ల (4,100 కోట్లు), శోభనా కామినేని (1,470 కోట్లు), సంగీతా రెడ్డి (1,400 కోట్లు), వనజాదేవి (850 కోట్లు), పద్మజ గంగిరెడ్డి (690 కోట్లు), నవీన (640 కోట్లు), రమాదేవి (640 కోట్లు), స్వర్ణలత గాలివీటి (580 కోట్లు), శాలినీ భూపాల్, (490 కోట్లు), ఉమాదేవి (420 కోట్లు), నారా భువనేశ్వరి (400 కోట్లు), అంజనాదేవి (300 కోట్లు). ఈ లిస్ట్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి 12 వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు, అపోలో సంస్థల అధినేత శోభనా కామినేని కూడా తెలుగు వారి జాబితాలో 3 వ స్ధానాన్ని దక్కించుకోవడం విశేషం.
Must Read ;- నెల వ్యవధిలో ముగ్గురు మహిళా కోటీశ్వరులు.