మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి పిశాచి గణం ఆగడాలతో మానవత్వం నలిగిపోతోంది. ఒకవైపు గూండాగిరి..,మరోవైపు పోలీసు చెంచాగిరితో ప్రజాస్వామ్యం చిగురుటాకులా వణకిపోతుంది.
పల్నాడు అంటేనే పౌరుషాలకు పురిటిగడ్డ. ఇక్కడ ఆర్దిక అంశాలు కన్న ఎక్కువగా ఆత్మాభిమానానికి పెద్దపీట వేస్తారు. ఇదే బలహీనతను గత రెండు దశాబ్దాలుగా పిన్నెల్లి బ్రదర్స్ అస్త్రంగా మల్చుకున్నారు. ఈ అస్త్రానికి అధికార యంత్రాంగం కూడా అజ్యంపోయడం మొదలు పెట్టారు. దీంతో మాచర్లలో మారాణహోమం మొదలైంది. ఆ హోమంలో బడుగు బలహీన,అనగారిన వర్గాలుగా సమిధలుగా మారుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ల ఆరాచక క్రీడా.. బడుగులకు చేటుగా దాపురించింది. తెలుగుదేశంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలను టార్గెట్ చేసుకుని వారు సాగిస్తున్న దమనకాండను తాళలేక ఎందరో ఆసువులు బాస్తున్నారు.
తెలుగుదేశంలో ఉన్న క్రియశీలక కార్యకర్తలను టార్గెట్ చేసి.., వారిని ఆర్ధికంగా, సామాజీకంగా దెబ్బతీయడమే పినెల్లి బ్రదర్స్ వ్యూహం. ఈ వ్యూహాలను జీ హుజూరు అంటూ అమలు చేడయంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వంతుగా మారింది. తమ దారికి రాని, కండువా మార్చని తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి.., అక్రమ కేసులు బనాయించడం, చిత్ర హింసలకు గురి చేయడం, జైలుకు పంపడం వంటివి ఆ పోలీస్ బాస్ వంతు అని బహిరంగంగానే వినిపిస్తున్న విమర్శ. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం ఆదివారం ఉదయం మాచర్ల నియోజకవర్గం వెల్దూర్తి మండలం, బంగారుపెంట తండలో ఎస్సై శ్రీహరి వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త దుర్గారావు ఆత్మహత్య.
చేపల వేటే జీవనాధరంగా బతుకు బండి సాగించే వ్యక్తి గంగాపుత్రుడు దుర్గారావు. కృష్ణానది నుంచి అధికారపార్టీ నేతలు నిత్యం తెలంగాణ మద్యాన్ని రవాణా చేస్తుంటారు. ఈ మద్యం స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత బార్ అండ్ రెస్టారెంట్లలో అధిక ధరకు అమ్మకాలు జరుపుతుంటారు. నది ఒడ్డున జీవించే దుర్గారావుపై స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు అక్రమ మద్యం రవాణాకు సహకరించాలని నిత్యం వత్తిడికి గురిచేస్తుంటారు. అంతేకాక ఆ వత్తిడిని నిరాకరించిన పాపానికి దుర్గారావుపై అక్రమ కేసులు బనాయించి.., చిత్రహింసలకు గురి చేశారు. బెయిల్ తీసుకొచ్చుకుని మరి తన కుటుంబాన్ని పోషించుకుంటుంటే వెల్దూరి ఎస్సై శ్రీహరి నిత్యం వేధించేవాడు. ప్రతిసారి దుర్గారావును స్టేషన్ కు పిలిపించి.., కొట్టడం.., ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం వంటివి పరిపాటిగా మారింది. మరోవైపు రెండు లక్షల లంచం ఇస్తావా..? లేకుంటే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తావా..? అంటూ వత్తిడి చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వెల్దూర్తి ఎస్సై శ్రీహరి దురాఘాతాన్ని భరించలేక దుర్గారావు చేపల వేటకు వెళ్తున్నాని చెప్పి.. ఆదివారం ఉదయం కృష్ణానదిలోకి పడవతో వెళ్లాడు. ఇన్నిరోజులు తనకు, తన కుటుంబానికి అన్నంపెట్టిన కృష్ణమ్మ వడిలోనే తన తనువు చాలించాలని భావించాడు దుర్గారావు. పడవను నది మధ్యలోకి తీసుకువెళ్లి.. తాడును పడవ కొనకు కట్టి.., మెడకు ఉరిపెట్టుకుని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి గంగపుత్రులు .., మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. వెల్దూర్తి ఎస్సై వేధింపులతోనే దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెల్దూర్తి మండల కేంద్రంలోని హైదరాబాద్.., అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంఘీభావంగా స్ధానిక టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టీడీపీని వీడలేక.., వైసీపీ లో చేరలేక.., ఎస్సై శ్రీహరి వత్తిడి తాళలేక ర్గారావు ఆత్మహత్యకు పాల్పడ్డారని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటామని.., తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధిని చూపుతామని హామీ ఇచ్చారు.
ఇలా చట్టాలను రక్షించాల్సిన రక్షక భటులే పాలకపక్షం వైపు నిలుచుని భక్షక రాక్షసులుగా మారుతుంటే.., పేదోడి మనుగడ మాచర్లలో ప్రశ్నార్ధకమేగా..? మాచర్లల్లో జరుగుతున్న దురాఘాతాలకు నిరుపేద కుటుంబానికి చెందిన దుర్మారావు ఆత్మహత్య నిదర్శనం కాదా..? వైసీపీ కార్యకర్తలుగా మారి.., ఖాకీ డ్రస్ ను అడ్డంపెట్టుకుని ఇటువంటి దారుణాలకు వడికడుతుంటే టీడీపీ, జనసేనలోని బడుగుల వేధనను ఎవరికి చెప్పుకోవాలి..? మాచర్లలో ప్రతిపక్షంపై నిత్యం జరిగే మారణ హోమానికి బ్రేకులు ఎప్పుడు పడుతాయి..? అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డూఅదుపు లేని ధనదాహంతో పిన్నెల్లి బ్రదర్స్ సాగిస్తున్న రక్త చరిత్రకు బ్రేకులు లేవా..? అంటే.. పిన్నెల్లి పిశాచిగణాన్ని ఓట్లేసి గెలిపించుకున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్పాలని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.