ఆర్పీ పట్నాయక్.. ఎన్నో పాటలతో ఆకట్టుకుని.. సంగీత ప్రపంచంలో తనదైన ముద్రను వేశారు. ఆర్పీ సంగీతం ఉంటే.. ఆ సినిమా హిట్టే అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఒకప్పుడు ఆర్పీ అంటే ఓ సంచలనం. అయితే.. సంగీత దర్శకుడుగా సంచలనం సృష్టించిన ఆర్పీ ఆతర్వాత నటుడుగా మారడం.. ఆతర్వాత దర్శకుడుగా మారడం తెలిసిందే. దర్శకుడిగా మారి ‘అందమైన మనసులో’ అనే సినిమా తీశారు. ఈ ప్రేమకథకు మంచి పేరు వచ్చింది కానీ.. కమర్షియల్ గా సక్సస్ సాధించలేదు.
ఆతర్వాత ‘బ్రోకర్’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ఆశించిన స్దాయిలో ఆకట్టుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆతర్వాత ‘ఫ్రెండ్స్ బుక్, తులసీదళం, మనలో ఒక్కడు’ సినిమాలు తీశారు. అయితే.. దర్శకుడిగా ఆశించిన విజయం మాత్రం ఇంకా రాలేదు. అయినప్పటికీ ఆర్పీ మాత్రం తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా వార్త ఏంటంటే.. ఇప్పుడు దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. అదే ‘కాఫీ విత్ కిల్లర్’. ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఆర్పీ నటించడంతో పాటు దర్శకత్వం, సంగీతం, నిర్మాణం కూడా ఆయనే.
షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. దర్శకుడు అయిన తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టేసారు. ఇప్పుడు దర్శకుడుగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా వర్క్ చేయడానికి రెడీ అంటున్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కి సంగీతం అందిస్తున్నారు. మరి.. ఇక నుంచైనా ఆర్పీ దర్శకుడిగా ఆశించిన విజయం సాధించి సక్సస్ ట్రాక్ లో వస్తారని ఆశిద్దాం.
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్
A surprise Package from me. Just wait for the updates… pic.twitter.com/Nj7iwyu9BW
— rp patnaik (@rppatnaik) December 25, 2020











