దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా అయినా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ వేదికల్లోకి వచ్చేస్తోంది.
భారీ ధరకు రైట్స్ తీసుకున్న సంస్థలు మూవీ థియేట్రికల్ రన్ ముగిసే లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ పెడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలాగే ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి.. ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి..? థియేటర్లో రిలీజ్ అయిన రెండు మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత నిర్మాత జయంతిలాల్ గడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ప్రజలు చాలా రోజుల పాటు సినిమా హాళ్లలో దీనిని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము అన్నారు. హిందీతో పాటుగా విదేశీ భాషలకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలకి చెందిన డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకుంది. ఈ లెక్కన ఓటీటీలో మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ భారీ రికార్డులను నమోదు చేయడం ఖాయం అని చెప్పచ్చు.
Must Read ;- గోండు బెబ్బులి.. మన్యం పులి.. వెరిసి ట్రిపుల్ ఆర్











