బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచి దూసుకెళుతున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్.
ఇటీవల ముంబాయిలో చాలా గ్రాండ్ గా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక చెన్నైలో నేడు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను చెన్నై ట్రేడ్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ తో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. అన్ని భాషల్లోను ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.
టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశమే హద్దు అనేలా ఉన్నాయి. బాహుబలి చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. దీంతో ఆర్ఆర్ఆర్.. బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ఆర్ఆర్ఆర్.. మళ్లీ వాయిదా పడడం నిజమేనా?