లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వ్యాప్తి తగ్గుతుండటంతో ప్రభుత్వాలు అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి బస్సు సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ఆపరేషన్ విభాగం ఈడీ బ్రహ్మానందారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి పూట మాత్రమే బస్సులు నడుస్తాయని, సుమారు 130 బస్సుల వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అంతర్ రాష్ట్రాలకు బస్సులను నడుపాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి 6 గంటల వరకు లాక్ డౌన్ ఉండటంతో, ఆ సమయంలో బస్సులు తిరుగుతాయని ప్రకటించింది. సోమవారం నుంచి ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Must Read ;- కర్ఫ్యూ వేళలు పొడిగించినా కరోనా నిబంధనలు పాటిస్తే క్షేమం