Ruhani Sharma Casted Into A Big Movie :
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రుహానీ శర్మ. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. అయితే.. ఇప్పుడు ఈ బ్యూటీకి ఓ మాంచి అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయ యువతకు బాగా చేరువయ్యాడు. యువతకు నచ్చేలా ఎమోషనల్, మాస్ యాంగిల్ లో నటించగల సత్తా కార్తికేయకు ఉంది. కార్తికేయ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి.
భారీ చిత్రాలని నిర్మిస్తోన్న యువీ క్రియేషన్స్ బ్యానర్ లో కార్తికేయ తదుపరి చిత్రం ఉండబోతోందని.. ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం యువీ సంస్థ యంగ్ బ్యూటీ రుహానీ శర్మని అప్రోచ్ అయినట్లు సమాచారం. కథ బావుండడం, క్రేజీ కాంబినేషన్, టాప్ ప్రొడక్షన్ హౌస్ కావడంతో రుహాని ఈ ఆఫర్ పట్ల థ్రిల్ ఫీల్ అయ్యిందట. ఈ చిత్రంలో నటించేందుకు రుహాని ఎగ్జైట్ గా ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తనకు కమర్షియల్ సక్సెస్ అందించడమే కాక, నటిగా మరో లెవల్ కి చేరుస్తుందని రుహాని గట్టి నమ్మకంతో ఉంది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలని, గ్లామర్ రోల్స్ ని రుహాని బ్యాలన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రుహాని ఇచ్చే గ్లామర్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. మరి.. ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీ వరుసగా అవకాశాలను అందుకుని ఫుల్ బిజీ అవుతుందేమో చూడాలి.
Must Read ;- అందాల ఆనందికి అదృష్టం పట్టేసినట్టే!











