సొంత మనుషులు కష్టాల్లో ఉంటే.. మనకెందుకులే అనుకుంటాం. అలాంటిది మూగజీవాలు ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిస్తే.. చూసి చూడనట్టు వెళ్లిపోతాం. కానీ కొందరే ముందుకువచ్చి తమలో మానవత్వం ఉందని చాటుకుంటారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సింగరాయపాలెంలో ఓ వీధి కుక్కకు యాక్సిడెంట్ అయింది. నడుము విరిగి రెండు కాళ్ళను కోల్పోయింది. నడవలేక మూలుగుతూ కనిపించింది.
కుక్క పడుతున్న కష్టాన్ని చాలామంది చూసి అయ్యో పాపం అన్నారు. కానీ గ్రామీణ వైద్యుడు షేక్ ఆషా కుక్క పరిస్థితిని చూసి చలించిపోయాడు. పిల్లలు ఆడుకునే చక్రాల బండికి మార్పులు, చేర్పులు కుక్కకు అమర్చాడు. దీంతో చక్రాల బండితో కుక్క గల్లీగల్లీలు తిరుగుతోంది. చక్రాల బండితో నడిచే కుక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. డాక్టర్ ప్రయత్నాన్ని శునక ప్రేమికులు అభినందిస్తున్నారు.
Must Read ;- నడిరోడ్డుపై రెండు హత్యలు.. కనుమరుగవుతున్న మానవత్వం..