ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడి!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. నాటో దళాలకు మద్దతు ఇవ్వదు అన్న రష్యా డిమాండ్ ను ఉక్రెయిన్ లక్ష్యపెట్టలేకపెట్టలేదు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. ఉదయం నుంచి ఇప్పటీ వరకు ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్ తో పాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టింది రష్యా సైన్యం. కీవ్ ఎయిర్ పోర్ట్ స్వాధీనం చేసుకుని శక్తివంతమైన బాంబులను కురిపించింది. మిలటరీ ఆపరేషన్ దిగిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్ ను ఆక్రమించింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్ నుంచి ఉక్రెయిన్ లోకి వేలాదిగా రష్యా బలగాలు ప్రవేశిస్తున్నాయి.
ఉక్రెయిన్ విషయంలో కలగజేసుకుంటే జాగ్రత్త!
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యలకు దిగగా.. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఎవరూ జోక్యం చేసుకున్న తీవ్ర పరిణామాలు తప్పవని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తనకు లేదని, ఆ దేశంలో జరిగే నాటో కార్యకలపాలకు మేము వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే రష్యా దాడులను అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలు ఖండించాయి. మరోవైపు ఉక్రెయిన్, నాటో దళాలు రష్యాపై ప్రతి దాడికి దిగాయి. రష్యాకు సంబంధించి 5 ఫైటర్ జెట్ విమనాలను కూల్చి వేసింది. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం రష్యా దాడిలో 300 మంది సైనికులు, ప్రజలు మృతి చెందగా.. దాదాపు 5 వేల మందికి పైగా గాయాలైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది! మరోవైపు తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉద్ఘాటించారు.
Must Read:-సైనికుల అదుపులో మయన్మార్ గాంధీ











