హోలీ అంటేనే రంగుల పండుగ… అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ప్రతిఒక్కరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. రంగులతో తడిసిపోతారు.. డ్యాన్సులతో హోరెత్తిస్తారు… ఒకరిపై ఒకరు కలర్ ఫుల్ రంగులు చల్లుకుంటారు.. మీరూ హోలీ ఆడుతున్నారా… ఈ టిప్స్ మీకోసమే మరి…
ఇవి అప్లయ్ చేయాలి
హోలీ ఆడిన తర్వాత మొదట ముఖాన్ని సాదా నీటితో శుభ్రం చేసుకొని ఫేస్ క్రీమ్ పూసుకోవాలి. హోలీ ఆడేందుకు సన్ స్ర్కీన్ లోషన్ అప్లయ్ చేయాలి. గోళ్లకు పెట్రోలియం జెల్లీ పూసుకోవడం మేలు. జుట్టు సంరక్షణ కోసం కూడా హెయిర్ ఆయిల్ పెట్టడంతోపాటు పెదవుల రక్షణకు లిప్ బామ్ రాసుకోవాలి.
రంగు పడకుండా…
రంగుల వల్ల చర్మం ఎర్రగా మారడంతోపాటు మంట, రాషెస్ రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు శరీరమంతా కప్పి ఉండాలి. అలర్జీ కనిపిస్తే వెంటనే నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. అలర్జీ అనిపించిన చోట ఐస్ ప్యాక్ పెట్టాలి. ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్‌ను హోలీ ఆడే ముందు చర్మానికి పట్టిస్తే రంగుల ప్రభావం తక్కువగా ఉంటుంది. జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే తలకు నూనె చిక్కగా పెట్టుకోవాలి. దీనివల్ల రంగులు శిరోజాలకు గట్టిగా పట్టుకోవు. తలస్నానం చేస్తే రంగులు సులభంగా పోతాయి.
Also Read ;- మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు
నాచురల్ కలర్స్
పసుపును రంగుగా వాడుకోవచ్చు. ఇందులోని యాంటీ బయాటిక్ గుణాలు చర్మానికి, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. కాబట్టి. దీనిని పూయొచ్చు. ఇందులో శనగపిండి కూడా కలిపి దీని ద్వారా కూడా హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని జరుగదు. కుంకుమ హోలీ రంగుగా వాడొచ్చు. దీనిని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. దీంతో మరో రంగు కావాలంటే.. పసుపు, కుంకుమని కలిపి వాడుకోవచ్చు. అంతేకాదు చందనం, ఎర్ర చందనం కూడా హోలీ ఆడేందుకు మంచి ఆప్షన్. కాబట్టి వీటిని కూడా ఉపయోగించి హ్యాపీగా హోలీ ఆడొచ్చు. వీటితో ఆడడం వల్ల చర్మంపై ఎలాంటి హాని జరుగదు. గులాబీలు, చామంతులు, దానిమ్మ, బీట్‌రూట్ ఇలా మీకు ఇష్టమైన వాటిని తీసుకొచ్చి, వాటిని కాస్తా నీటిలో మరిగించి చల్లారక వాటిని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
Must Read ;- అరవైలో ఇరవైలా : పట్టులాంటి చర్మం కోసం

Also Read ;- మట్టినీరే.. మహాఔషధం!
Safety Tips For Holi Celebrations 2021 :
కరోనాకు దూరంగా…
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే పట్టుకుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి సందర్భంలో హోలీ పండుగ వచ్చింది. దీంతో రంగులు చల్లుకోవాలంటేనే చాలా భయం. ఎందుకంటే చాలా వరకూ రంగులు చైనా నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇంట్లోనే మనమే రంగులను తయారు చేసి హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎటువంటి వైరస్ లక్షణాలు లేని వారితో ఆడవచ్చు. వేడుకను తక్కువ మందితో ఆడితే వైరస్ వచ్చే ప్రమాదం లేదని చెబుతున్నారు నిపుణులు. పెద్ద గ్రూప్‌లో హోలీ ఆడుతుంటే, అప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరోనా వేళ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.











