వచ్చిందే .. మెల్లమెల్లగా వచ్చిందే… క్రీమ్ బిస్కటు ఏసిందే.. యాక్టింగ్ ఇరగాదీసిందే.. క్రేజ్ పట్టుకుపోయిందే .. అని సాయిపల్లవి కోసం ఫిదా పాట లిరిక్స్ ను తిరిగి రాసుకోవాలి. నిజమే.. ఇక్కడ హీరోయిన్ గా అమ్మడి క్రేజ్ చూస్తుంటే.. అలాంటి పాటలే రాసుకోవాలి మరి. ఆమె ఏమంత అందగత్తె కాదు. పైగా పింపుల్స్ డింపుల్. అలా అని ఎక్స్ పోజింగూ చేయదు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ గానీ ఉండి ఉంటే.. ఈ పాటికి తిరుగు టపాలో పంపించేసి ఉండేవారు మన వారు. కానీ సాయిపల్లవిలోని యాక్టింగ్ టాలెంట్ ఆమెను సౌత్ కే క్వీన్ ను చేసేసింది.
‘ఫిదా, యం.సీ.ఏ, పడిపడిలేచె మనసు’ సినిమాలతో సాయిపల్లవి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. మరో పక్క ‘కణం, మారి2. యన్.జీ.కే’ సినిమాలతో కోలీవుడ్ ప్రేక్షకుల్నీ మెప్పించింది. ప్రస్తుతం సాయిపల్లవి .. ‘లవ్ స్టోరీ , విరాటపర్వం’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. అమ్మడి ట్రాక్ రికార్డు యావరేజ్ గా ఉన్నా.. ఆమెకు పెద్ద పెద్ద ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. వేదాళం తెలుగు రీమేక్ లో సాయిపల్లవి ఏకంగా చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోందట. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.
ఇక నేచురల్ స్టార్ నానీ హీరోగా.. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శ్యామ్ సింగరాయ్’ లో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. యం.సీ.ఏ తర్వాత నానీ తో రెండోసారి సాయి రొమాన్స్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం సాయిపల్లవి ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేసిందట. అమ్మడు తెలుగులో నటించినవి మూడే మూడు సినిమాలు .అందులో రెండు సినిమాలే హిట్టయ్యాయి. అలాంటి అమ్మడు అంత భారీ గా రెమ్యునరేష్ కోట్ చేయడం దర్శక, నిర్మాతల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయినా సరే.. దీనిపై మేకర్స్ సాయిపల్లవితో బేరసారాలు సాగిస్తున్నారట. అయితే ఇందులోని ఆ పాత్రకు సాయిపల్లవి మాత్రమే యాప్ట్ అని భావిస్తున్నదర్శకుడు .. ఎలాగైనా ఆమెను ఒప్పించే ప్రయత్నంచేస్తున్నాడట.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రధానంగా కోల్ కత్తాలో చిత్రీకరణ జరుపుకోనుందట. వచ్చే ఏడాది కోల్ కత్తాలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో నానీ మూడు వైవిధ్యమైన పాత్రలు పోషించబోతున్నాడని టాక్. మరి రౌడీ బేబీ కి ఈ సినిమా ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
జగన్‌ని టెన్షన్ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...











