తమిళ పొణ్ణు సాయిపల్లవి .. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. గ్లామర్ గా ఎలివేట్ అవకుండా.. కేవలం పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రమే అమ్మడు సూపర్ క్రేజ్ సంపాదించడం నిజంగా గ్రేట్. ఎందరో స్టార్ హీరోలు సాయిపల్లవితో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటే దానికి కారణం అదే. ఇక ఆమె బెస్ట్ పెర్ఫార్మరే కాకుండా.. బెస్ట్ డాన్సర్ కూడా. ఇప్పటి వరకూ సాయిపల్లవి నటించిన సినిమాల్లో నర్తించిన పాటలు ఆమెకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి.
ఫిదా లో వచ్చిండే , హే పిల్లగాడా , ధనుష్ ‘మారి2’ లోని రౌడీ బేబీ.. పాటలు యూ ట్యూబ్ ను షేక్ చేసి పడేశాయి. అందులో ముఖ్యంగా సాయిపల్లవి మైండ్ బ్లోయింగ్ స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాలోని పాట ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ చేసి పడేస్తోంది. ఆ పాట శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగదరియా’. ప్రస్తుతం ఈ పాట రికార్డు వ్యూస్ ను తెచ్చుకోవడం విశేషం.
తెలంగాణ ఓల్డ్ జానపద పాటను తీసుకొని .. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా రీమిక్స్ వెర్షన్ గా రాశారు ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక తేజ. విడుదలైన రోజు నుంచి ఈ పాట యూ బ్యూబ్ లో కంటిన్యూస్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తునే ఉంది. అత్యంత వేగంగా 100 మిలియన్స్ క్రాస్ చేసిన సారంగదరియా పాట.. ఇప్పుడు 200 మిలియన్స్ వ్యూస్ ను దాటడం.. నిజంగా వండరే. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ గానే ఉంది. మరి ఫ్యూచర్ లో ఈ పాట ఇంకే రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;-కలకత్తా కాళిక అవతారమెత్తిన సాయిపల్లవి











