టైగర్ సల్మాన్ ఖాన్ కూ కత్రినా కైఫ్ కూ ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు పట్టపగ్గాలు లేకుండా చెట్టపట్టాలేసుకు తిరిగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో ఎడమొహం పెడమొహంగా మారిపోయారు. ఈ ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారన్న వదంతులు ఎప్పట్నుంచో ఉన్నా చివరికి అలాంటిదేమీ జరగలేదు. ఇంటివారు కాకపోయినా సినిమాల్లో మాత్రం జంటగా కనిపిస్తున్నారు. ఈ టైగర్ కాంబినేషన్ పునరావృతమవుతూనే ఉంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఇప్పుడు బాగా వర్కవుట్ అవుతోంది.
ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత తాజాగా ‘టైగర్3’ మళ్లీ వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా ఇందులో కనిపించబోతున్నారు. టైగర్ సిరీస్ లో ఇదో మూడో భాగం. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న రణ్ వీర్ షోరే, సల్మాన్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. ఈ మూడో పార్ట్ లో రాణ్ వీర్ పాత్రకు చోటు కల్పించారు. సల్మాన్ పోషించిన రా ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ కు సహాయకుడి పాత్ర ఇది. కామెడీకి ఎక్కువ అవకాశం ఉంటుంది.
నిర్మాత ఆదిత్య చోప్రా, రచయిత జైదీప్ సాహ్నిల నిర్ణయం మేరకు ఈ పాత్రను మళ్లీ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో మరో నటి కూడా ఉంటుంది. ఆమె ఎవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ సినిమా షూటింగ్ లో కత్రినా కూడా పాల్గొనాల్సి ఉంది. అందుకోసం ఆమెకు కోవిడ్ పరీక్షలు కూడా చేశారు. ఈ నెలాఖరు నుంచి కత్రినా మళ్లీ షూటింగులో పాల్గొంటుంది. ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రను పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. సల్మాన్, కత్రినా సినిమాల్లో చేస్తున్న మ్యాజిక్ నిజజీవితంలో మళ్లీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది వేచి చూడాలి. ఎందుకంటే సల్మాన్ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లరే.
Must Read ;- బాలీవుడ్ లో తడాఖా చూపుతున్న పటాఖా భామ