మెగాస్టార్ చిరంజీవి స్పీడు మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకెళుతున్నారు. లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ రాజా తమిళ్ లో సూపర్ హిట్ మూవీస్ ని తెరకెక్కించాడు. తెలుగులో అది కూడా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రం పై మరింత క్రేజ్ తీసుకురావడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ స్పెషల్ రోల్ చేయిస్తున్నారు. లూసీఫర్ లో పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ ను సల్మాన్ తో చేయిస్తున్నారు. దీని గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇది వాస్తవమా.? కాదా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. అయితే.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి సార్, సల్మాన్ సార్ కలసి డ్యాన్స్ చేయనున్నారు.
ఇది నిజంగా మాకు పెద్ద విషయం. అందుకే ఈ పాట స్థాయి కూడా పెద్దగా ఉండాలి. అందుచేత ఇంటర్నేషనల్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో ఆ పాటను పాడించాలి అనుకుంటున్నాం. కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీలతో మాట్లాడుతున్నాం అంటూ అసలు విషయం బయటపెట్టాడు తమన్. ఇక తెర పై చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేస్తే.. అభిమానులకు పండగే.
Must Read ;- చిరు మూవీలో పవనా.? రవితేజా..?











