మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీకి రీమేక్. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి భారీ చిత్రాల నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని సంప్రదించారని.. ఈ మూవీలో సల్మాన్ నటించడం ఖాయమని టాక్ వచ్చింది.
ఆతర్వాత సల్మాన్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదనే వార్త వినిపించింది. దీనికి సంబంధించి తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు కండలవీరుడు సల్మాన్ ఓకే చెప్పారట. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సల్మాన్ పాత్ర ఇంతకు ముందు అనుకున్న దాని కంటే.. ఎక్కువుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సల్మాన్ ఖాన్ పై ఓ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి గాడ్ ఫాదర్ ను మెగా ఫ్యాన్స్ కు పండగ లాంటి సినిమాగా అందించేందుకు దర్శకుడు మోహన్ రాజా తెర వెనుక బాగానే కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఊటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు – సల్మాన్ కలిసి గాడ్ ఫాదర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
Must Read ;- చిరు మూవీకి నో చెప్పడానికి కారణం ఇదే సాయి పల్లవి











