మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. మిగతా చోట్ల కూడా మంచి క్రేజ్ నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. అయితే విషయంలోనే ‘ఆచార్య’ కి ఓ భారీ చిత్రం గట్టి పోటీనివ్వబోతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘రాధే’ మూవీ కూడా సరిగ్గా మే 13న విడుదల కాబోతోంది. ‘రాధే’ రంజాన్ కానుకగా రాబోతోందని సల్మాన్ ముందుగానే ప్రకటించాడు. ఇప్పుడు డేట్ కూడా ఇచ్చేశాడు. చిరుకి, సల్లూ భాయ్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం పోటీ తప్పదు. ఉత్తరాదిన , కర్నాటకలో ఆచార్య సినిమాకి కలెక్షన్స్ విషయంలో గండి పడే అవకాశ ముందంటున్నారు . ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాధే సినిమా మెగాస్టార్ ఆచార్య సినిమాకి ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.
Must Read ;- మారేడుమిల్లి అడవుల్లో చిరంజీవి .. చరణ్ పోరాటం!