సమంత, అక్కినేని నాగ చైతన్య వైవాహిక జీవితం నుంచి వేరుపడ్డాక ఎవరికి వారు వారి వారి పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇద్దరూ కెరీర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. త్వరలోనే “చై” చేస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, “సామ్” మూవీస్ సైతం రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. కాగా, తాజాగా ఇద్దరి పేర్లు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. ప్రస్తుతం అవి హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. దీనిపై నాగ చైతన్య కానీ శోభిత కానీ ఏమీ స్పందించలేదు. అయితే “చై”కు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వదంతుల వెనుక సమంత పీఆర్ టీం ప్రమేయం ఉందని, ఇదంతా వారే కావాలని చేయిస్తున్నారని నాగచైతన్య అభిమానులు ఆరోపిస్తున్నారు.
తనపై సోషల్ మీడియా వేదికగా “చై” అభిమానులు చేస్తున్న ఆరోపణలపై సమంత ఘాటుగా స్పందించారు. మానసికంగా ఎదగాలంటూ, తమ సొంత పనిపై దృష్టి పెట్టాలంటూ తనదైన ధాయిలీలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అమ్మాయిపై వస్తున్న పుకార్లు మాత్రం నిజం !! అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అవి ఓ అమ్మాయి పుట్టించినవి!! అబ్బాయిలూ ఎదగండి. మీ పని, మీ కుటుంబాలపై దృష్టి సారించండి’’ అని సమంత తన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
ఇదిలా ఉంటే సమంత తో విడిపోయాక నాగచైతన్య ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే మొదటిసారి.అయితే నాగచైతన్య ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.