తన నటనతో అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే సమంత మరో క్రేజీ సినిమాకు కమిట్ అయ్యిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను అమెరికా బ్యాక్ డ్రాప్ లో తియనున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ఎన్టీఆర్ సినీ జీవితంలోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.
అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో హీరోయిన్ గా సమంతను ఒకే చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఆమెకు కథను చెప్పాడని, కథ నచ్చడంతో సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కథ పరంగా హీరోతో పాటుగా హీరోయిన్ కూడా యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా మొదట మహేష్ బాబు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ తో షూటింగ్ ను పట్టాలెక్కిస్తాడట. ఇక ఈ సినిమాకి ‘పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో అంటేనే ఫాన్స్ కు పండుగ. దానికితోడు ఈ సినిమాలో సమంత కూడా చేరితే వాళ్ళ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే సమంత త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అ..ఆ’ చిత్రాలలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ తో సమంత నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ – సమంత కాంబినేషన్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.











