ప్రేమ అనేది మనుషులకేనా జంతువులకు ఉండదా? ఆ విషయాన్ని రుజువు చేసే ఘటన కంటబడితే స్పందించకుండా ఎలా ఉంటారు. నటి సమంతకు కూడా ఇలాంటి ప్రేమ కనిపించే సరికి తట్టకుకోలేకపోయింది. ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోని షేర్ చేసి నిజమైన ప్రేమ ఇంకా బతికే ఉందంటూ కామెంట్ కూడా చేసింది. ఇంతకీ అది ఎవరి ప్రేమో చూద్దాం. తనతో ఎప్పటినుంచో కలిసున్న ఓ ఆవు దూరమయ్యే సరికి ఓ ఎద్దు తట్టుకోలేకపోయింది. ఆ ఆవును ఓ రైతు తరలించబోతుంటే వెంటబడి మరీ నిలదీసింది.
ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యాన్ లో ఆ ఆవును తరలిస్తుంటే ఎద్దు వెంటబడిన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఎడబాటు అనేది ఎలా ఉంటుందో అద్దం పట్టే వీడియో అది. దాంతో ఆ రైతు హృదయం కూడా కరిగిపోయింది. అతను మనసు మార్చుకున్నాడు.. ఆ ఆవును, ఎద్దును మళ్లీ కలిపాడు. ఈ వీడియోన సమంతా షేర్ చేసి లవ్ సింబల్ ను జోడించి మరీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.
https://twitter.com/Samanthaprabhu2/status/1304263883440500736











