సమంతా, నందినీ రెడ్డి కాంబో మళ్లీ రాబోతోంది. వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు ‘ఓ బేబీ’ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఓ హారర్ మూవీకి వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ మంచి స్నేహం ఉంది. దానికి తోడు ‘ఓ బేబీ’ కూడా మంచి హిట్ సాధించింది. హిట్ కాంబినేషన్ గా ముద్ర పడినప్పుడు సినిమా చేయడంలో తప్పేముంది. ఇప్పటిదాకా మంచి కథ కోసమే నందినీరెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి కథ దొరికిందట. దాంతో తొందరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సోనీ పిక్చర్స్ కోసం ఓ సినిమాకి సమంత అంగీకరించింది. దీనికి అశ్విన్ శరవణన్ ను దర్శకుడిగా అనుకున్నారు. సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతుందనుకున్న తరుణంలో అశ్విన్ తప్పుకోవడం జరిగింది. దాంతో ఈ సినిమా బాధ్యతలను నందినికి అప్పగించినట్టు సమాచారం. ఈ కథకు తుదిమెరుగులు దిద్ది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే కథ అశ్విన్ దే నట. ఆ కథను నందిని రెడ్డితో చేయించటానికి ఒప్పందం జరిగింది. నందిని హారర్ జోనర్ చేయడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి రెండుమూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.