సమంత తాజాగా నటిస్తున్న సినిమా శాకుంతలం. క్రియేటీవ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు నయనతారతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తుంది. ఓ బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం.. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ తో కూడా సక్సస్ సాధించడంతో సమంతకు బాలీవుడ్ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. అలాగే ఓటీటీ కంపెనీల నుంచి కూడా భారీ ఆఫర్స్ వచ్చాయి. వీటితో పాటు సమంత.. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తుందని.. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందే మూవీలో కూడా నటిస్తుందని వార్తలు వచ్చాయి.
అయితే… ఇటీవల బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకి సమంత ఇంటర్ వ్యు ఇచ్చింది. ఈ ఇంటర్ వ్యూలో తన గురించి ప్రచారంలో ఉన్న వార్తల పై సమంత క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ.. ఏం చెప్పిందంటే.. నాగ్ అశ్విన్ నాకు.. ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వలేదు. అందుచేత నేను ప్రభాస్ మూవీలో నటించడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు అని క్లారిటీ ఇచ్చింది సమంత. అంతే కాకుండా.. తనకు వరుసగా భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది సమంత.
అందుకనే అనుకుంట బంగార్రాజు సినిమాలో చైతన్య సరసన నటించే ఛాన్స్ వచ్చినా నో చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాకు సైన్ చేయలేదు. మరి.. లాంగ్ బ్రేక్ అంటే.. మళ్లీ సమంత ఎప్పుడు సినిమాలు చేస్తుందో..? ఏ సినిమాకు ఓకే చెబుతుందో..? తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Must Read ;- ప్రభాస్ పక్కన ‘బెల్ బాటమ్’ భామ











