అంతా అనుకున్నట్టే జరిగింది. చైతూకు సమంత బాయ్ బాయ్ చెప్పేసింది. దాంతో పాటు కొత్త బాయ్ ఫ్రెండ్ కు కూడా హాయ్ హాయ్ చెప్పేసింది. కొత్త ఫ్రెండ్ తో ఉన్న ఫొటో కూడా తెగ వైరల్ అవుతోంది. అక్కినేని వారసుడు నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోతున్నట్లు వచ్చిన వార్తలు పుకారు కాదని, అది నిజమేనని ఈరోజు తేటతెల్లమైంది. నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంటు ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ‘ మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
దీని మీద చాలా చర్చలు జరిగాయి. ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సామ్, నేను చాలా ఆలోచించాం. భార్యాభర్తలుగా మేం విడిపోతున్నాం. పదేళ్లకు పైగా మా స్నేహం కొనసాగడం మా అదృష్టం’ అని పేర్కొన్నారు.ఈ విషయంలో మా శ్రేయోభిలాషులు, మీడియా తమకు అండగా నిలబడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమంత కూడా తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా ఇదే విషయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా కొనసాగిన వదంతులకు చెక్ పడినట్లే. వీరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు లియో న్యూస్ మొదటనే ప్రకటించింది. త్వరలో వారు విడిపోతున్నట్లు కూడా తెలిపింది.
ఈ విషయం ఈరోజు అధికారికంగా తెలిసింది. గత కొంత కాలంగా దీనిపై ఎవరూ నోరు మెదపలేదు. ఆమె ట్వట్టర్ అకౌంట్ లో అక్కినేని అన్న తన ఇంటి పేరును మార్చినప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత దీనిపై నెట్టింట అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడే వారు వివరణ ఇవ్వాల్సింది. అప్పుడు దాటవేత ధోరణిని అవలంబించారు. స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ ద్వారా అతనికి మంచి దొరికింది.
నాగార్జున వివరణ
నాగచైతన్య, సమంతల విడాకులపై అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నాసామ్, చైతు మధ్య ఏం జరిగిందో తెలియదు. అది వారి వ్యక్తిగతం. ఇద్దరూ నా మనసుకు దగ్గరివారే. సామ్ తో గడిపిన మధుర క్షణాలను మా కుటుంబం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.ఆమె ఎప్పటికీ మాకు ప్రియమైన వ్యక్తే. ఆ దేవుడు వారికి ఆత్మస్థయిర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.
సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ‘ఏమాయ చేసావె’తో మొట్టమొదటి సారిగా వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత అది స్నేహంగా, క్రమేపీ ప్రేమగా మారింది. 2010లో ఏమాయ చేశావే సినిమా విడుదలతే 2017 అక్టోబరు 6న వీరు వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లకే వీరి వివాహ బంధం తెగిపోయింది. మజిలీ చిత్రం వీరిద్దరూ కలిసి నటించిన ఆఖరి చిత్రం. వీరిద్దరి చివరి మజిలీ విడిపోవడమే. ఇదిలా ఉంటే తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఆమె దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Must Read ;- లవ్ స్టోరీలో సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి