ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముద్దు బిడ్డ, ఓటీటీ వేదిక ‘ఆహా’లో సమంతకు బెర్త్ కన్ ఫర్మ్ అయిపోయింది. అసలు హోస్ట్ గా సమంత ఎలా చేస్తుందన్న దానిపై సందేహాలు తీరిపోయాయి. మామ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగుకు వెళితే బిగ్ బాస్ 4 లో ప్రత్యేక హోస్ట్ గా సమంత తళుక్కుమంది. అసలు హోస్ట్ గా ఆమెకు మార్కులు ఎలా పడతాయా అన్నది అక్కడే తేలిపోయింది.

ఇంతకీ ఆహాలో సమంత పాత్ర ఏమిటన్నది చూడాలి. ఈ విషయాన్ని వెల్లడించడానికి అల్లు అరవింద్ ఈ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఆహా కోసం సమంత ఏం చేయబోతోందన్న మీద క్లారిటీ ఇచ్చేశారు. ప్రాంతీయ ఓటీటీగా దూసుకు పోవడానికి కావలసిన సాధన సంపత్తిని అల్లు అరవింద్ స మకూర్చుకుంటున్నారు. అందులో భాగమే సమంతను ఆహాలోకి ఆహ్వానించడం.
ఈ టాక్ షో పేరు సామ్ జామ్ అట. డిజైన్ చేసిన తీరు చూస్తే సమాజం అని అర్థం వచ్చేలా చేయించారు. దీని గురించి సమంతా మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ టాక్ షో తనకు పెద్ద చాలెంజింగ్ టాస్క్ అని అభిప్రాయపడ్డారు. దీనితో పోలిస్తే నటనే సులభమని అనిపిస్తోందన్నారు. సామ్ జామ్ చేయడానికి మంచి టీమ్ దొరికిందని చెప్పారు. బిగ్ బాస్ కు హోస్ట్ చేయడానికి తన మామయ్య నాగార్జున నిర్ణయమని చెప్పారు. సమాజంలో ఉన్న సమస్యల గురించే ఈ షోలో మాట్లాడతానని అన్నారు.
ఈ షో ద్వారా సమంత ఏం చేయబోతోందో తెలుసా? పేరు మసిన సూపర్ స్టార్లనూ, సెలబ్రిటీలనూ ఇంటర్వ్యూ చేయబోతోందట. ఈ నెల 13 నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ షో ప్రోమోను కూడా ఈరోజు విడుదల చేశారు. ఆహోకు 18 మిలియన్ల యూజర్లు ఉన్నట్లు అల్లు అరవింద్ చెప్పారు. పెద్ద నటులతో ఈ షోకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దీపావళి రోజున తాము ఓ పెద్ద కార్యక్రమాన్ని రూపొందించబోతున్నట్లు అరవింద్ తెలిొపారు.












