ది ఫ్యామలీ మేన్ 2లో నటించిన సమంత రాజీ పాత్రలో అదరగొట్టేసింది. సమంత వన్ వుమెన్ షో.. అంటూ.. ఈ వెబ్ సిరీస్ ని అభివర్ణిస్తున్నారంటే ఎంతలా నటించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు సమంతకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట.
సమంత.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు ఇది. ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటనను చూసిన వాళ్లు.. సమంతను కాదు.. చిరుత పులిని చూశాం అంటూ అభినందిస్తున్నారంటే.. ఆమె నటన ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో అనుకుంటే.. సినిమాల ఎంపికలో తన రూటు మార్చింది. విభిన్న పాత్రలతో అందర్నీ మెప్పించింది. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించింది.
ది ఫ్యామిలీ మేన్ 2తో సమంతకు డిమాండ్ బాగా పెరిగింది. నార్త్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైం విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో మంచి విజయం సాధించింది. ఇక్కడ తొలి సిరీస్‌తోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమంతకు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే.. ప్రస్తుతం సమంత సినిమాలు బాగా మార్కెట్ చేస్తున్నాయి. దీని దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ ఆమెతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తోందని తెలిసింది.
ఇందుకు గాను సమంతకు ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దమైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంత వరకు నిజముందన్నది తెలియదు కానీ.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- రవితేజ, నాగచైతన్య, సమంత, నిఖిల్ షూటింగ్ డేట్స్ ఫిక్స