‘హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట’ లాంటి సినిమాలతో మంచి వినోదాన్ని పంచి.. టాలీవుడ్ లో బర్నింగ్ స్టార్ అనిపించుకున్న కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం సంపు హీరోగా .. పలు చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో ఒక దానికి ‘పుడింగి నెం. 1’ అనే టైటిల్ ను ఖాయం చేశారు మేకర్స్. శ్రీ పుణ్యభూమి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లి బ్యానర్ పై .. కె.శ్రీనివాసరావు, కె. సుధీర్ కుమార్ సంయుక్త నిర్మాణంలో నూతన దర్శకుడు మీరావళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నేడు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ నిర్మాత కె. యస్.రామారావు క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాసరావు కెమేరా స్విచాన్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
విద్యుల్లేఖా రామన్, సాఫీ కౌర్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, రాకెట్ రాఘవ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ను జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఖుద్దూస్ సంగీతం అందిస్తుండగా.. భాస్కర భట్ల లిరిక్స్ రాస్తుండడం విశేషం. మరి పుడింగి నెం. 1 గా సంపూ ఏ రేంజ్ లో కామెడీ పండిస్తాడో చూడాలి.
Must Read ;- ‘ఆచార్య’ సినిమాకి ఇతడి కామెడీ చాలా స్పెషలట..!











