మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంచయిత గజపతి రాజు పేరు వార్తలలో వినబడుతోంది. మాజీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సంచయిత బాబాయ్ అశోక్ గజపతి రాజు చాలా రోజుల నుంచి ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు మాత్రం ఇటీవలి కాలంలో ఈ ట్రస్ట్ గురించి విమర్శలు చేశారు. వారికి ఆమె స్ట్రాంగ్ గా బదులు ఇస్తూ ట్వీట్లు చేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాన్సాస్ ట్రస్టు సంప్రదాయాలకు భిన్నంగా ట్రస్టీలను మార్చేశారని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో కూడా ఇలాగే చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
హిందూ వ్యవస్థలపై దాడి చేయడం ఎక్కువైపోయిందని మండిపడ్డారు. అంతర్వేది రధం కాల్చివేత విషయంపై మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది రంగంలోకి దిగిన సంచయిత వరుస ట్వీట్లను చేసింది. ” పవన్ కళ్యాణ్ గారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా హిందూయేతర వ్యక్తి ఉన్నారని చెప్పారు. మీకు ఓ విషయాన్ని స్పష్టం చేయాలని ఈ ట్వీట్ చేస్తున్నాను. మా తల్లితండ్రులు ఇద్దరూ హిందువులే. మా అమ్మ రమేష్ అనే పురోహిత్ ను రెండో వివాహం చేసుకుంది. ఆయన కూడా హిందువే. రమేష్ నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్న వ్యక్తి. మీరు టీడీపీ చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దు.
మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ ల ఆడిటింగ్ కు నేను ఆదేశించడం టీడీపీకి భయాన్ని కలిగిస్తోంది. చేసిన తప్పిదాలు బయట పడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ముందు నేను హిందువుననే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. హిందూ ధర్మం ప్రకారం అన్నీ మతాలను నేను గౌరవిస్తా. మీరు చేసిన ప్రకటనను సవరిస్తూ మరో ప్రకటన చేయండి. చంద్రబాబు & కో ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుందని” ఆమె ట్వీట్ చేశారు. గత ఎన్నికలలో విజయం సాదించగానే వైసీపీ ప్రభుత్వం అప్పటి వరకు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి సంచయిత గజపతిని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించనున్నాడో చూడాలి!!