ఏపీలో ఎవ్వరూ ఊహించని అరాచకం చోటు చేసుకుంది. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత రుణాలు ఇవ్వడం లేదని విజయవాడ, ఉయ్యూరుల్లోని 18 ప్రభుత్వ బ్యాంకుల ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్త కుమ్మరించారు. అంతేకాదు కమిషనర్ చెబితేనే చెత్త డంప్ చేశామని పారిశుద్ధ్య కార్మికులు చెబుతుండటం గమనార్హం. విజయవాడలో 16 బ్యాంకుల ముందు తెల్లారేసరికి చెత్త దర్శనం ఇవ్వడంతో బ్యాంకు అధికారులు విస్తుపోయారు. మీడియాలో, సోషల్ మీడియాలో చెత్త వార్త వైరల్ కావడంతో వెంటనే వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు రంగంలోని దిగి చెత్తను తరలించడం సంచలనంగా మారింది.
అన్నా నీ తోడు ఇదేనా?
ఉయ్యూరులో వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో పారిశుద్ధ్య కార్మికులు రెచ్చిపోయారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. జగనన్న తోడు రుణాలు ఇవ్వడం లేదని లారీల కొద్దీ చెత్త తీసుకువచ్చి బ్యాంకుల ముందు కుమ్మరించడం అనాగరిక చర్య అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలే కరోనా స్ట్రెయిన్ వ్యాపిస్తోందని జనం భయపడుతున్న సమయంలో వైసీపీ నాయకులు ప్రోత్సాహంతో పారిశుద్ధ్య కార్మికులు చేసిన ‘చెత్త పని’ జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
Also Read ;- ‘జగనన్న గుండెల్లో జనం ఎజెండా’ ఈ మాట రేటు 25 కోట్లు!
ఇంత ఘోరమా?
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎవరైనా భారీగా పన్నులు బకాయి పడితే వారి ఇంటి ముందు చెత్త వేయడం ద్వారా నిరసన తెలపడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, నిత్యం ప్రజా సేవలో ఉండే బ్యాంకులపై వైసీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇవాళ జగనన్న తోడు రుణాలు ఇవ్వడం లేదని చెత్త వేయించిన పాలకులు బ్యాంకులపై కూడా బెదిరింపులకు దిగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు చెత్త వేశారని చెబుతున్నా వారి వెనుక ఎవరూ లేకుండా ఇంత సాహసానికి దిగరని విజయవాడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రయోజనం లేకపోగా ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు.
Must Read ;- ఇదేం పద్ధతి : హవ్వ దేవుడి సొత్తునూ నొక్కేస్తారా?