బిజెపి పార్టీ ఓ పెద్ద వటవృక్షం లాంటిది. మరీ అలాంటి పార్టీలో ఉంటూ కొందరు నేతలు పార్టీ పరువు బజారున పడేసే విధంగా వారి వ్యవహారశైలి ఉండడం పార్టీకి మైనస్‌గా మారుతోంది.బాధ్యతగల జిల్లా అధ్యక్షుడి పదవిలో ఉంటూ ఓ మహిళా కార్యకర్తతో జిల్లా స్థాయి నేత అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదికాస్త రాష్ట్ర బిజెపి నాయకత్వం దృష్టికి పోవడంతో ఆయనపై బండి సంజయ్ వేటు వేసినట్లు తెలిసింది.
తెలంగాణ బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణపై రాష్ట్ర అధిష్ఠానం వేటువేసింది. ఆయనకు సంబంధించి.. ఓ మహిళా కార్యకర్తతో రాసలీలలు ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సత్యనారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంకు దారితీసింది. బిజెపి పార్టీ బాధ్యత గల జిల్లా అధ్యక్షుడి పదవిలో ఉంటూ మహిళా కార్యకర్తలతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైంది కాదని బండి సంజయ్ ఆయన తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నూతన అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి..
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణపై వేటు వేసి ఆయన స్థానంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని బండి సంజయ్ వెంటనే నియమించారు. దీనికి సంబంధించి బండి సంజయ్ శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అలాగే బాస సత్యనారాయణ ఓ మహిళాతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ రెండు అంశాలపై స్థానిక నేతలంతా అభ్యంతరం వ్యక్తం చేయడంతో బండి సంజయ్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు.
ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆడియోలు బయటికి రావడం ఆ పార్టీకి రాజకీయంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజుల క్రితం దుబ్బాక దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమారుడు ఓ మహిళతో అసభ్యంగా ఫోనులో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.











